కేసీఆర్ దిగుమన్నారు: తుమ్మల షాకింగ్ కామెంట్స్

By pratap reddyFirst Published Nov 29, 2018, 9:27 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీని వీడే సమయంలో తాను ఎంతగానో బాధపడ్డానని తుమ్మల చెప్పారు. మీకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. పక్క రాష్టం పార్టీలు ఇక్కడ ఎందుకని ఆయన అడిగారు.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఖమ్మం అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎన్నికల ప్రచార సభలో గురువారం దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, కానీ కేసిఆర్ తనను బరిలోకి దిగుమని చెప్పారని ఆయన అన్నారు 

తెలుగుదేశం పార్టీని వీడే సమయంలో తాను ఎంతగానో బాధపడ్డానని తుమ్మల చెప్పారు. మీకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. పక్క రాష్టం పార్టీలు ఇక్కడ ఎందుకని ఆయన అడిగారు. రాష్ట్రంలో ఉండే పార్టీలే ఇక్కడ రాజకీయం చేయాలని అన్నారు.  

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికే తాను ఎన్నికల్లో నిలబడ్డానని చెప్పారు  జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని ఆయన అన్నారు. ఈ సారి జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే సీతరామ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పారు.

click me!