సెల్ఫీ మోజు.. ముగ్గురు బాలికల ప్రాణాలను తీసింది

Siva Kodati |  
Published : Nov 15, 2020, 07:31 PM IST
సెల్ఫీ మోజు.. ముగ్గురు బాలికల ప్రాణాలను తీసింది

సారాంశం

నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. 

నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. వీరి మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సెల్ఫీ మోజే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదకర స్థలంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ముగ్గురూ నీట మునిగారు. మృతులను జుబేరా (16), మీరాజ్ (14), మషేరా (12)గా నిర్ధారించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు