చౌటుప్పల్ లో లారీని ఢీకొట్టిన బైక్: ముగ్గురు యువకులు దుర్మరణం

Published : Aug 28, 2021, 08:37 AM ISTUpdated : Aug 28, 2021, 08:38 AM IST
చౌటుప్పల్ లో లారీని ఢీకొట్టిన బైక్: ముగ్గురు యువకులు దుర్మరణం

సారాంశం

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వే బ్రిడ్డి నుంచి రివర్స్ తీసుకుంటుండగా లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

చౌటుప్పల్: తెలంగాణలోని భువనగిరి- యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ లోని ధర్మోజిగుడా సమీపంలో బైకును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వేబ్రిడ్జి నుంచి లారీని రివర్స్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్డు మీదికి రావడంతో బైక్ దాన్ని ఢికొట్టింది. మృతులను హరీష్, సల్మాన్, ఆసిఫ్ లుగా గుర్తించారు. 

మృతుడు హరీష్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందినవాడు. మిగతా ఇద్దరు హైదరాబాదులోని రామంతపూర్ కు చెందినవారు. పిట్టంపల్లి నుంచి వారు హైదరాబాదు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు కూడా హైదరాబాదులో ఏసీ మెకానిక్ లుగా పనిచేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్