కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

Published : Jun 14, 2019, 09:54 AM ISTUpdated : Jun 14, 2019, 10:30 AM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

సారాంశం

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయమై కిషన్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయమై కిషన్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెల 20వ తేదీన  ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డికి 69734063  నెంబర్ నుండి ఫోన్ చేసి బెదిరించారు.   మూడు రోజుల క్రితం కూడ ఇదే రకమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో మంత్రి కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కిషన్ రెడ్డిని చంపుతామని దుండగులు  బెదిరించినట్టుగా సమాచారం ఈ బెదిరింపు కాల్స్‌పై మంత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!