యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు..

Published : Feb 05, 2021, 01:57 PM IST
యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు..

సారాంశం

నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ లో గురువారం టిప్పర్ లారీ ఢీకొని రాజు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. రాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శుక్రవారం ధర్నాకు దిగారు. 

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెడితే.. వీర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మన బోయిన రాజు యాదాద్రి పవర్ ప్లాంట్ లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం 5న యూనిట్ వద్ద నడుచుకుంటూ వెల్తుండగా వెనకనుంచి టిప్పర్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మిర్యాల గూడ ఆసపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. 

ప్లాంట్ లో పనిచేసే వ్యక్తి చనిపోతే యాజమాన్యం పట్టించుకోలేదని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవర్ ప్లాంట్ ముందు స్తానికులు ధర్నాకు దిగారు. గతంలో జరిగిన ప్రమాదాలకు యాజమాన్యం ఇచ్చని హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని స్తానికులు ఆరోపించారు. 

ఆందోళన కారులు ప్లాంట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 
PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే