నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల ఆందోళన: ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Mar 1, 2023, 1:31 PM IST


రంగారెడ్డి జిల్లా నార్సింగి  శ్రీచైతన్య  కాలేజీ ముందు  విద్యార్ధి సంఘాలు  ఆందోళనకు దిగాయి.  సాత్విక్  మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు. 



హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నార్సింగి   శ్రీ చైతన్య కాలేజీ  ముందు  బుధవారంనాడు  ఉద్రిక్తత చోటు  చేసుకుంది. కాలేజీలోకి  విద్యార్ధి సంఘాలు  చొచ్చుకెళ్లాయి.  కాలేజీ లోపలకి వెళ్లి విద్యార్ధి సంఘాల  నేతలను  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. 

నార్సింగి  శ్రీచైతన్య కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి  సాత్విక్   మంగళవారంనాడు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను నిరసిస్తూ  కాలేజీ ముందు  ఇవాళ  ఎన్ఎస్‌యూఊ, ఏబీవీపీ  విద్యార్ధి సంఘాలు  ఆందోళనకు దిగాయి.  కాలేజీ గేటుకు  తాళం వేసి ఉండడంతో  గేటు దూకి  కాలేజీ లోపలికి వెళ్లారు విద్యార్ధి సంఘాల నేతలు.  కాలేజీ లోపలికి విద్యార్ధి సంఘాల నేతలు  వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ  కొందరు విద్యార్ధి సంఘాల  నేతలు  కాలేజీ లోపలికి వెళ్లారు. కాలేజీ లోపలికి వెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Latest Videos

ఇంటర్ బోర్డు ముందు  ఎస్ఎఫ్ఐ ఆందోళన

సాత్విక్ మృతికి కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపును రద్దు  చేయాలని డిమాండ్  చేస్తూ  ఇంటర్ బోర్డు ముందు  ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. గతంలో కూడా ఈ కాలేజీకి చెందిన  పలు క్యాంపస్ లలో  విద్యార్ధులు మృతి చెందారని ఎస్ఎఫ్ఐ నేతలు గుర్తు  చేస్తున్నారు. విద్యార్ధుల మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్  చేసింది.  

also read:ఒత్తిడే కారణం:నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ మృతిపై ఏసీపీ

మరో వైపు ఇవాళ ఉదయం కాలేజీ ముందు సాత్విక్ పేరేంట్స్ ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని  డిమాండ్  చేశారు.   ఆందోళన చేస్తున్న సమయంలోనే  సాత్విక్ తల్లి  స్పృహ తప్పి పడిపోయింది.   సాత్విక్  మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం  పూర్తైన తర్వాత  సాత్విక్ మృతదేహన్ని  కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

click me!