చలో అసెంబ్లీకి వీఆర్ఏల పిలుపు: ఇందిరా పార్క్ వద్దే అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Sep 13, 2022, 12:48 PM IST


తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చలో అసెంబ్లీ కి వీఆర్ఏలు పిలుపునిచ్చారు. అసెంబ్లీ వైపునకు వీఆర్ఏలు రాకుండా పోలీసులు ఇందిరాపార్క్ వద్ద అడ్డుకున్నారు.
 


హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్ఏలను పోలీసులు ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్నారు. పోలీసులతో వీఆర్ఏలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వీఆర్ఏల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వీఆర్ఏలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అసెంబ్లీ వైపు వీఆర్ఏలు వెళ్లకుండా పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇందిరాపార్క్ వద్దనే వీఆర్ఏలను పోలీసులు నిలువరించారు. వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.  ఇందిరాపార్క్ తో పాటు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు వీఆర్ఏలను అడ్డుకున్నారు. 

వీఆర్ఏల సమస్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో నిన్న ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. వీఆర్ఏల తీరును కేసీఆర్ తప్పుబట్టారు. మానవీయ కోణంలోనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరించిందన్నారు. అర్హత ఆధారంగా ఆయా శాఖల్లో వీఆర్ఏలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఈ విఁషయమై సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. అంతేకాదు వీఆర్ఏలకు వేతనాలు కూడా పెంచిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అయితే వీఆర్ఏలు మాత్రం తమను రెవిన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

Latest Videos

click me!