అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని తమకు మరికొంత సమయం కావాలని అడిగారు. ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ విజ్ఞప్తిని విన్న న్యాయస్థానం పూర్తి వాదనలు తర్వాత వింటామని హైకోర్టు విన్నవించింది.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలపై సోమవారం హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు.
జీతాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు 30 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హైకోర్టుకు పిటీషనర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలపై వాదోపవాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
undefined
అయితే అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని తమకు మరికొంత సమయం కావాలని అడిగారు. ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ విజ్ఞప్తిని విన్న న్యాయస్థానం పూర్తి వాదనలు తర్వాత వింటామని హైకోర్టు విన్నవించింది. బుధవారం పూర్తి వాదనలు వింటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.