తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నిక జరిగిన ఆరింటికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

10:23 AM (IST) Dec 14
తెలంగాణలో ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఖమ్మం, నల్గోండ, ఆదిలాబాద్, మెదక్ తో పాటు కరీంనగర్ లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
10:13 AM (IST) Dec 14
ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ 738 ఓట్లు వస్తే పుష్పవాణికి కేవలం 75ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 667 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
09:58 AM (IST) Dec 14
కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థల్లో భాను ప్రసాద్ కు 500 ఓట్లు, ఎల్ రమణకు 450 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కేవలం 175ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు.
09:55 AM (IST) Dec 14
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకున్నా ఆ పార్టీ నుండి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ బలం కేవలం 116 మాత్రమే కాగా 239 ఓట్లు వచ్చాయి. అంటే టీఆర్ఎస్ పార్టీనుండి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది.
09:50 AM (IST) Dec 14
మెదక్ జిల్లాలో 1018 ఓట్లు పోలయితే టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 762 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి 238 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 6 ఓట్లు వచ్చాయి.
09:46 AM (IST) Dec 14
కరీంనగర్ అభ్యర్థి ఎల్ రమణ, భాను ప్రసాద్ కు చెరో 300వ ఓట్లు దక్కాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు 98 ఓట్లు వచ్చాయి.
09:40 AM (IST) Dec 14
ఆదిలాబాద్ జిల్లాలో దండే విఠల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ 210 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమయ్యింది.
09:37 AM (IST) Dec 14
ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ కు 299 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి కేవలం 96 ఓట్లు మాత్రమే వచ్చాయి.
09:31 AM (IST) Dec 14
నల్గొండ జిల్లాలో ఎంసి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపు ఖాయమైంది. 691 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది.
09:30 AM (IST) Dec 14
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 768 ఓట్లు వుండగా 738 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వర రావుకు 239 ఓట్లు వచ్చాయి. దీంతో 247 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించింది.
09:22 AM (IST) Dec 14
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుదిశగా దూసుకుపోతోంది. అధికార పార్టీ అభ్యర్థి తాతా మధు 385 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు 168ఓట్లు వచ్చాయి.
09:18 AM (IST) Dec 14
కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగ్గా రెండిట టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యమే కొనసాగుతోంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని... టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనకే ఓటేస్తారని ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు నిరాశే ఎదురయ్యేలా వుంది.