తెలంగాణలో కల్వకుంట్ల ప్రభుత్వమే నడుస్తోంది : మంత్రి తలసాని వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Aug 13, 2019, 6:01 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారని అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారని అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీతో కలిసిపోతున్నారంటూ తమపై విమర్శలు చేసే కన్నా బీజేపీయే కలిసి వెళ్లొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. పాతబస్తీలో బీజేపీ బలోపేతానికి ఎంఐఎంతో కలిసి వెళ్లండి అంటూ విరుచుకుపడ్డారు. 

పుల్వామా ఘటన జరిగినప్పుడు ఎంఐఎం నేతలు మోదీకి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు అనేది దేశానికి మంచి జరిగేవి కాబట్టే బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిందని తెలిపారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేస్తే 113 స్థానాల్లో  డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. 

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే బీజేపీ ఓర్వలేకపోతుందంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్రపెద్దలతో మాట్లాడి జాతీయ ప్రాజెక్టులు, నిధులు రాష్ట్రానికి తీసుకువస్తే ప్రజలు ప్రశంసిస్తారు కదా అంటూ బీజేపీపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  

click me!