స్వామిగౌడ్‌తో పొన్నం ప్రభాకర్ భేటీ: కాంగ్రెస్‌లోకి ఆహ్వానం?

By narsimha lodeFirst Published Jan 18, 2024, 10:17 AM IST
Highlights

తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ తో  మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది.

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ తో  గురువారం నాడు  తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  భేటీ అయ్యారు.   

కిస్మత్ పూర్‌లోని  స్వామి గౌడ్ ఇంటికి  ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు . స్వామి గౌడ్ నివాసంలో  అల్పాహరం తీసుకున్నారు. స్వామి గౌడ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. స్వామిగౌడ్ ను  కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.  మర్యాదపూర్వకంగానే  స్వామి గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయినట్టుగా  అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే  ఈ విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

2022 అక్టోబర్  21న  భారత రాష్ట్ర సమితిలో  స్వామి గౌడ్  చేరారు.  తొలుత  బీఆర్ఎస్‌లోనే ఉన్న స్వామి గౌడ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.  బీజేపీకి  రాజీనామా చేసిన  స్వామి గౌడ్ బీఆర్ఎస్ లో చేరారు.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  స్వామి గౌడ్,  దాసోజు శ్రవణ్ కుమార్ లో బీజేపీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడిగా  స్వామి గౌడ్ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సాగిన తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్  కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో  ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత  స్వామి గౌడ్  తన ఉద్యోగానికి  రాజీనామా చేశారు.  2014లో  తెలంగాణ రాష్ట్రంలో  భారత రాష్ట్ర సమితి  అధికారంలోకి వచ్చింది.  స్వామి గౌడ్ కు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. తెలంగాణ శాసనమండలి చైర్మెన్ పదవిని కూడ స్వామి గౌడ్ కట్టబెట్టారు.

అయితే  రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని  స్వామి గౌడ్ కు ఆసక్తి ఉండేది. కానీ  రాజేంద్రనగర్ అసెంబ్లీ టిక్కెట్టు మాత్రం  స్వామిగౌడ్ కు  కేటాయించలేదు ఆ పార్టీ. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  స్వామి గౌడ్  బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.  మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు  బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 

తెలంగాణ రాష్ట్రంలో  గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది . హైద్రాబాద్ పై  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  ఈ తరుణంలో స్వామి గౌడ్ తో పొన్నం ప్రభాకర్ భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

 

click me!