వరిపై పోరు: ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులు

Published : Mar 22, 2022, 04:43 PM IST
వరిపై పోరు: ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులు

సారాంశం

 వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం మంగళవారం నాడు ఢిల్లీకి బయలు దేరింది. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది.

హైదరాబాద్: యాసంగిలో Paddy ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు Delhiకి బయలు దేరింది.

Punjab  రాష్ట్రం నుండి కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది.ఈ విషయమై కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

సోమవారం నాడు TRS శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశం తర్వాత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని  ఈ సమావేశం డిమాండ్ చేసింది. కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆహార్ శాఖ మంత్రి Piyush Goyal  ను కలిసి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే తెలంగాణ తరహలోనే పోరాటం నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీకి బయలుదేరే ముందు Shamshabad విమానాశ్రయంలో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు. పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు తెలంగాణ  రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.  ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.రాష్ట్రం నండి బియ్యాన్ని కేంద్రమే  తీసుకువెళ్లాలన్నారు. .కానీ తీసుకు వెళ్లకుండా తమపై నిందలు మోపడం విడ్డురంగా ఉందన్నారు.

బియ్యం సరఫరా కోసం రైల్వే వ్యాగన్లను సమకూర్చుమంటే సమకూర్చలేదు మళ్ళీ తమపై నిందలు వేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండి పడ్డారు. 

కేంద్ర మంత్రుల నుండి స్పష్టమైన హామీ రాకపోతే మా భవిష్యత్ కార్యాచరణ నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించారు దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు.ఇప్పటికే ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారన్నారు. ఇవాళ తాను,పువ్వాడ  అజయ్,ప్రశాంత్ రెడ్డి,గంగుల కమలాకర్ ‌లు ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. 

వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.వరి దాన్యం కొనుగోలు పై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలన్నారు.  లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలన్నారు. కానీ ఈ విషయమై  బండి సంజయ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడితే స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా  అని మంత్రినిరంజన్ రెడ్డి బండి సంజయ్ ను ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..