Gangula Kamalakar: మ‌రోసారి కరోనా బారినపడ్డ మంత్రి గంగుల కమలాకర్.. సోష‌ల్ మీడియాలో వెల్ల‌డి 

Published : Jul 16, 2022, 03:12 PM IST
Gangula Kamalakar: మ‌రోసారి కరోనా బారినపడ్డ మంత్రి గంగుల కమలాకర్.. సోష‌ల్ మీడియాలో వెల్ల‌డి 

సారాంశం

Gangula Kamalakar  తాజాగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మ‌రోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయ‌నే స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించారు.

Gangula Kamalakar:  దేశ‌వ్యాప్తంగా కరోనా మహమ్మారి మ‌రోసారి విజృంభిస్తుంది. ఇప్పటికీ అనేక మంది  కరోనా కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. గ‌త కొంత కాలం ఈ వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన‌.. గ‌త నెల రోజుల కూడా ఈ వైర‌స్ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా..  కొంత మంది ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే..  ఇప్ప‌టికే చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా భారిన పడగా... కొంత కోలుకుంటే మరి కొందరు ప్రాణాలను కోల్పోయారు. 

తాజాగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మ‌రోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయ‌నే స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించారు. గ‌త రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్లు వెల్ల‌డించారు. అలాగే.. గ‌త కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేట్ కావాలని సూచించారు. గతంలో  హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో తిరిగిన సందర్భంలో సైతం మంత్రి కమలాకర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!