ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా: గంగుల కమలాకర్ కౌంటర్

Published : Jul 19, 2021, 09:31 PM IST
ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా: గంగుల కమలాకర్ కౌంటర్

సారాంశం

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకొన్నాయి. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను  మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ఈటల ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేస్తానని ప్రకటించారు.

కరీంనగర్: సానుభూతి కోసమే మాజీ మంత్రి ఈటల రాజేందర్  చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.తనపై హత్యకు కుట్ర పన్నుతున్నారని జిల్లాకు చెందిన మంత్రే ఈ కుట్రలు చేశారని  ఈటల రాజేందర్ పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 

also read:నన్ను చంపేదుకు కుట్రలు...: ఈటల రాజేందర్ సంచలనం

ఈటల రాజేందర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీలో ఉన్న రాజేందర్  ఈ విషయమై సీబీఐ, ఎన్ఐఏతో విచారణ జరించుకోవాలని సవాల్ విసిరారు.అేంతేకాదు ఈ విషయంపై తొందరగా తేల్చాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రంతో చెప్పి ఈటల ఆరోపణలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన కోరారు. ఓటమి భయంతోనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈటల రాజేందర్‌కు ఏమీ కాదని ఆయన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.