TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

By Sumanth KanukulaFirst Published Jun 28, 2022, 11:12 AM IST
Highlights

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు.  తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in‌లోకి వెళ్లి ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. అక్కడ ఇంటర్ ఫస్టియర్/సెకండియర్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

ఫలితా విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67. 82 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో, హన్మకొండ సెకండ్ ప్లేస్‌లో నిలిచాయని వెల్లడించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. ఆగస్టు ఒకటి నంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని పేర్కొన్నారు. 

click me!