వీఆర్‌వోల సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే..

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 2:45 PM IST
Highlights

వీఆర్‌వో సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వీఆర్‌వో సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

వీఆర్‌వో సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వీఆర్‌వో సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇప్పటికే 98.9 శాతం వీఆర్‌వోలు ఇప్పటికే ఇతర శాఖల్లో చేరారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. ఇంకా 56 మంది వీఆర్‌వోలే ఇతర విభాగాల్లో చేరాల్సి ఉందని చెప్పారు. అయితే తదపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్పష్టం చేశారు. 

ఇక, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌.. ఈ ఏడాది జూలై 27న జీవో నెంబర్‌ 121ను జారీ చేశారు. ఇందులో వీఆర్వోలను ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న వాటి పై మార్గదర్శకాలను విడుదల చేశారు. వీఆర్వోలను మొత్తం 37 శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను గుర్తించింది. అయితే చాలా మంది వీఆర్వోలు..  సర్దుబాటు ప్రక్రియపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లఘించినట్లేనని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 

click me!