తెలంగాణ అధికారులపై ఆగ్రహం: టెస్టులే చేయకుండా కరోనా ఎలా తెలుస్తోందన్న హైకోర్టు

Published : Oct 12, 2020, 04:15 PM IST
తెలంగాణ అధికారులపై ఆగ్రహం: టెస్టులే చేయకుండా కరోనా ఎలా తెలుస్తోందన్న హైకోర్టు

సారాంశం

గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు వైద్య ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు సుదీర్ఘంగా విచారణ సాగింది.  


హైదరాబాద్: గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు వైద్య ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు సుదీర్ఘంగా విచారణ సాగింది.

అధికారుల తీరులో మార్పు రాలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.
కరోనాతో మరణించినవారి సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు హైకోర్టుకు తెలిపారు. టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎలా తెలుస్తాయని హైకోర్టు ప్రశ్నించింది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయని హైకోర్టు తెలిపింది.

వెంటిలేటర్లు, బెడ్ల సమాచారాన్ని ఆసుపత్రుల దగ్గర ఎందుకు డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.  తప్పుడు లెక్కలతో హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని హైకోర్టు  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్