ప్రపంచ శిఖరంపై రెపరెపలాడిన తెలంగాణ చేనేత కీర్తి

By sivanagaprasad kodatiFirst Published Dec 20, 2018, 11:05 AM IST
Highlights

తెలంగాణ చేనేత కీర్తి ప్రపంచ శిఖరంపై రెపరెపలాడింది. నేతన్నలకు చేయూతనందించేందుకు తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రోత్సాహంతో, బూట్ అండ్ క్రాంపన్స్ సంస్థ సహకారంతో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 8న చారిత్రక సాహస యాత్రను చేపట్టింది. 

తెలంగాణ చేనేత కీర్తి ప్రపంచ శిఖరంపై రెపరెపలాడింది. నేతన్నలకు చేయూతనందించేందుకు తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రోత్సాహంతో, బూట్ అండ్ క్రాంపన్స్ సంస్థ సహకారంతో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 8న చారిత్రక సాహస యాత్రను చేపట్టింది.

ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత శిఖరం కోజిస్కో పర్వతాన్ని ఒక్క రోజులో అధిరోహించి కొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన రాజీవెంకట్, ఎం. లావణ్య, సృజన, చిన్నారులు హశిత, సామాన్యలు చేనేత వస్త్రాలను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో అందరూ చేనేతే చీరలు, వస్త్రాలు ధరించి ఈ సాహాస యాత్ర చేపట్టారు.

ఈ నెల 8న బయలుదేరిన ఈ బృందం 9న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నది. అక్కడి నుంచి 12వ తేదీన క్యాన్‌బెర్రాకు, అక్కడి జిందాబైన్ ప్రాంతం నుంచి ఉదయం 8 గంటలకు సముద్ర మట్టానికి 7,310 అడుగుల ఎత్తులో ఉన్న కోజిస్కో పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం ప్రారంభించారు.

ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా ఏకబిగిన 10 గంటల సేపు ప్రయాణించి యాత్రను పూర్తి చేశారు. అయితే ఈ బృంద సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆఫ్రీకాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో, ఆగస్టు 5న మౌంట్ ఎలబ్రస్, ఈ నెల 12న మౌంట్ కోజిస్కోను అధిరోహించారు.

వచ్చే ఏడాది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను ఎక్కాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సాహస బృందంలో ఎనిమిదేళ్ల చిన్నారి సామాన్యు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సు పర్వతారోహకుడిగా రికార్డు సృష్టించాడు. సికింద్రాబాద్‌లోని బోల్టన్ హైస్కూలులో మూడవ తరగతి చదువుతున్న సామాన్యు తన తల్లి లావణ్య, అక్క హశితతో కలిసి కజిస్కో పర్వతాన్ని అధిరోహించాడు. 
 

 

click me!