మృతదేహాలకు కరోనా టెస్టులు: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

By telugu team  |  First Published Apr 21, 2020, 8:46 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టుల విషయంలో అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ  చేసింది.


హైదరాబాద్: కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మృతదేహాలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఆస్పత్రులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కరోనా వైర్స పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం రాత్రికి 872కు చేరుకున్నాయి. మృతుల సంఖ్య 23కు చేరుకుంది. మరణించిన తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొంత మందికి కరోినా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

Latest Videos

undefined

తెలంగాణలో ఇప్పటి వరకు 186 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టవ్ కేసుల 663 ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్  డౌన్ ను మే 7వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే.

సోమవారంనాడు తెలంగాణలో కొత్తగా 14 కరోనా వైరస్ కేసుల నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే 12 కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. 

కంటైన్మెంట్లలోని ప్రజలు బయటకు రావద్దని కేసీఆర్ హెచ్చరించారు. స్విగ్గీ, జొమాటో సేవలను కూడా కేసీఆర్ రద్దు చేశారు. మత, ఇతర సామూహిక సమ్మేళనాలను కూడా నిషేధించారు. 15 రోజుల పాటు బయటి ఆహారం తినవద్దని కూడా కేసీఆర్ ప్రజలకు సూచించారు. మూడు నెలల పాటు అద్దెలు వసూలు చేయరాదని ఇళ్ల యజమానులను ఆదేశించారు. 

click me!