మృతుల అంత్యక్రియలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు

By telugu teamFirst Published Apr 9, 2020, 1:14 PM IST
Highlights

మృతుల అంత్యక్రియలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు మారదర్శకాలను జారీ చేసింది. అంత్యక్రియల్లో ఐదుగురికి మించి పాల్గొనకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్: మృతులకు అంత్యక్రియలు నిర్వహించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరణించివారి అంత్యక్రియలు నిర్వహించడానికి పాటించాల్సిన నియమాలను పొందుపరుస్తూ మార్గదర్శక సూత్రాలను  జారీ చేసింది.

శవాన్ని సంచీలో పెట్టి నేరుగా స్మశానానికి తరలించాలని, శవాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియలకు ఐదుగురికి మించి హాజరు కాకూడదని కూడా ఆదేశించింది. 

మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలను, ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అంత్యక్రియల విధులు నిర్వహించే సిబ్బంది ఇతర విధులు నిర్వహించకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో బుధవారం సాయంత్రానికి 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ సోకి మరణించారు. ఈ స్థితిలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగాంగానే మృతుల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 5,734కు చేరుకుంది.473 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 166కు చేరుకుంది. 

click me!