ఎస్ఈసీతో మాట్లాడుతా: ఉత్తమ్‌ లేఖకి ఫోన్ లో గవర్నర్ తమిళిసై రిప్లై

Published : Apr 23, 2021, 04:02 PM ISTUpdated : Apr 23, 2021, 04:06 PM IST
ఎస్ఈసీతో మాట్లాడుతా: ఉత్తమ్‌ లేఖకి ఫోన్ లో గవర్నర్ తమిళిసై రిప్లై

సారాంశం

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం నాడు ఫోన్ చేశారు. గవర్నర్ కి ఉత్తమ్  లేఖ రాయడంతో  తమిళిసై ఫోన్ చేశారు.  

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం నాడు ఫోన్ చేశారు. గవర్నర్ కి ఉత్తమ్  లేఖ రాయడంతో  తమిళిసై ఫోన్ చేశారు.రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో  రాష్ట్రంలోని రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశాడు. 

ఈ లేఖలో పొందుపర్చిన విషయాలపై ఇతర అంశాలపై చర్చించేందుకు గను తమిళిసై ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం నాడు ఫోన్ లో మాట్లాడారు. లేఖలో పొందుపర్చిన అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ఆమె అడిగి తెలుసుకొన్నారు. ఎన్నికల విషయమై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తానని  గవర్నర్  తమిళిసై ఉత్తమ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ పిటిషన్ దాఖలు చేశారు.  రెండు దఫాలు ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.  రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు మున్పిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather