ఆసుపత్రిలో రజనీకాంత్: ఆరోగ్యంపై ఆరా తీసిన తమిళిసై

Published : Dec 25, 2020, 06:11 PM IST
ఆసుపత్రిలో రజనీకాంత్: ఆరోగ్యంపై ఆరా తీసిన తమిళిసై

సారాంశం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం నాడు ఆరా తీశారు.

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం నాడు ఆరా తీశారు.

శుక్రవారం నాడు  మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. రజనీకాంత్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యులను కోరారు.బీపీ పెరగడంతో  శుక్రవారం నాడు హైద్రాబాద్ ఆపోలో ఆసుపత్రిలో చేరారు. సినిమా షూటింగ్ కోసం రజనీకాంత్ హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

రజనీకాంత్ సినిమా యూనిట్ లో ఆరుగురికి కరోనా సోకింది. ఆ సమయంలో రజనీకాంత్ కు  పరీక్షలు నిర్వహించారు. కానీ ఆయనకు కరోనా సోకలేదు.దీంతో షూటింగ్ ను నిలిపివేసి రజనీకాంత్ హొం ఐసోలేషన్ లోనే ఉన్నారు.

అయితే శుక్రవారం నాడు  హై బీపీతో బాధపడుతూ ఆయన అపోలో ఆసుపత్రిలో చేరాడు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.రజనీకాంత్ కు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అభిమానులు ఎవరూ కూడ ఆసుపత్రి వద్దకు రావొద్దని వైద్యులు కోరారు.


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu