తెలంగాణలో కరోనా కట్టడిపై గవర్నర్ ఆరా: ఈటలకు తమిళిసై ఫోన్

By narsimha lodeFirst Published Apr 4, 2021, 3:43 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిపై తీసుకొంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు.
 

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిపై తీసుకొంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు.

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  ఫోన్ చేశారు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారనే విషయమై ఆరా తీశారు. ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను మంత్రి ఈటల రాజేందర్ గవర్నర్ కు వివరించారు.

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన యాప్ గురించి  మంత్రిని గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మాస్కులు , భౌతిక దూరం పాటించాలని గవర్నర్ సూచించారు. ఈ విషయమై ప్రజల్లో మరింత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆమె సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొంటుందుి. మాస్క్ లు ధరించనివారికి ఫైన్ లు విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమికూడకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. 

click me!