గ్రామ పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

By narsimha lodeFirst Published Dec 24, 2018, 8:37 PM IST
Highlights

తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.


హైదరాబాద్:  తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. ఇందులో భాగంగానే  గ్రామ పంచాయితీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని సగం గ్రామ పంచాయితీలను మహిళలకు రిజర్వ్ చేసింది  తెలంగాణ సర్కార్

తెలంగాణలో 12751 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయితీల్లో సగం గ్రామ పంచాయితీల్లో 6378 గ్రామ పంచాయితీలను మహిళలకు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 2113 గ్రామ పంచాయితీలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు1865,  బీసీలకు2345 గ్రామపంచాయితీలను  రిజర్వ్ చేశారు.

వంద శాతం రిజర్వేషన్లు గిరిజనులున్న గ్రామ పంచాయితీను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. షెడ్యూల్ ఏరియాలో 1281గ్రామ పంచాయితీలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
ఈ రిజర్వేషన్లను  ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపుతోంది. ఈ రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు.

click me!