తెలంగాణ ఎన్నికలు.. విజయశాంతి చెప్పిందే నిజమైంది

By ramya neerukondaFirst Published Dec 11, 2018, 11:22 AM IST
Highlights

ఈ ఎన్నికల ఫలితాల విషయంలో .. కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి చెప్పిందే నిజమైందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారైంది. లగడపాటి సర్వేపై ధీమాతో ఉన్న మహాకూటమి అభ్యర్థులకు మొండి చేయి మిగిలింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల విషయంలో .. కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి చెప్పిందే నిజమైందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయితే.. ఈ పొత్తుపై మొదటి నుంచీ విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత.. తమపై పడే అవకాశం ఉందని.. విజయశాంతి మొదటి నుంచీ పార్టీ నేతలను హెచ్చరిస్తూనే ఉన్నారు. 

చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అది  కాంగ్రెస్ నేతలపై ప్రభావం చూపించి.. విజయం టీఆర్ఎస్ కి దక్కే అవకాశం ఉందని ఆమె గతంలో తన అభిప్రాయన్ని వెల్లబుచ్చారు. అయితే.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. టీడీపీతో పొత్తును అధికారికంగా ఖరారు చేయడంతో.. విజయశాంతి వెనక్కి తగ్గక తప్పలేదు. 

తాజాగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. విజయశాంతి చెప్పిందే నిజమైంది అనిపిస్తోంది. టీడీపీతో పొత్తు కారణంగానే.. కాంగ్రెస్ ఓడిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చినన్ని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో రావడం కష్టమని తెలుస్తోంది. 

click me!