తెలంగాణ ఎన్నికలు.. మొదటి ఫలితం ఇక్కడే..

Published : Dec 11, 2018, 08:00 AM IST
తెలంగాణ ఎన్నికలు.. మొదటి ఫలితం ఇక్కడే..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం వెలువడనున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం వెలువడనున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ ఓట్ల లెక్కింపులో తెలంగాణ తొలి ఫలితం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విడుదల కానుంది.  రాష్ట్రంలో మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలు ఉండగా..అతి తక్కువగా భద్రాచలంలో 161 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది గంటలకే భద్రాచలం ఫలితం వెలువడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక భద్రాచలం తర్వాత ఫలితం వెలువడే రెండో నియోజకవర్గం అశ్వారావుపేట. ఈ అసెంబ్లీలో 164 కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు