
రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ నేతల పనితీరుపై తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ (manickam tagore) అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వం రీచ్ కానీ నేతలు ఏ స్థాయి వారినైనా పక్కకు పెడతామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఎన్నికల నియమావళి మార్చిన తెలంగాణ కాంగ్రెస్ .. ఈ క్రమంలోనే నేతలకు హెచ్చరికలు చేసింది. గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని ఠాగూర్ తేల్చిచెప్పారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే నామినేషన్, పార్టీలో ఎన్నికలు నిర్వహిస్తామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ మేరకు డీసీసీ సమావేశంలో సీనియర్ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. నాయకుల చుట్టూ తిరగడం, కండువాలు కప్పి రాజకీయం అనుకోవద్దని ఠాగూర్ సూచించారు.
కాగా.. సంస్ధాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఆయా Districts అధ్యక్షులు, నియోజకవర్గాలకు కూడా పార్టీ నాయకత్వం టార్గెట్‌లు విధించింది. అయితే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కావొస్తున్నా కూడా కొందరు నాయకులు అలసత్వం వహిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా పార్టీ నాయకులు కొందరు డుమ్మా కొట్టారు. దీంతో సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన నేతలకు కాంగ్రెస్ నాయకత్వం Show cause నోటీసులు జారీ చేసింది. 2018లో అసెంబ్లీకి పోటీ చేసిన నేతలు తమకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేయకపోతే పీసీసీలో చోటు దక్కదని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చింది.
కొద్దిరోజుల క్రితం పార్టీ సభ్యత్వ నమోదుపై Revanth Reddy సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరించిన వారిని రేవంత్ రెడ్డి అభినందించారు. Online లో 558 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించిన మిర్యాల సుమంత్ ను రేవంత్ అభినందించారు. శశికాంత్ 532 మందికి సభ్యత్వం ఇప్పించారు. వీరిని సమీక్షా సమావేశంలోనే రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ను కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. ఇవాళ్టితో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గడువు పూర్తి కానుంది. రాష్ట్రం నుండి 30 లక్షల మందిని సభ్యులుగా చేర్పిస్తామని రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి Shabbir Ali సుమారు 400 మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి సుమారు 20 వేల మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించారు. ప్రతి మండలంలో 15 వేల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించాలని రేవంత్ రెడ్డి టార్గెట్ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని రేవంత్ పార్టీ నాయకులను కోరారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3.5 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించాలని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.