రాష్ట్రంలోని మూడు వేల మందికి శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మూడు వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసినవారికి శిక్షణ ఇవ్వనున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు వేల మందికి శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యలు శుక్రవారంనాడు సీఎల్పీలో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మండలానికి ఐదుగురు చొప్పున నియమించి పార్టీకి అవసరమైన డేటాను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను మండలానికి ఐదుగురు మెరికల్లాంటి కార్యకర్తలను సిద్దం చేసుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు ప్రతి మండలం నుండి ఎంపిక చేసిన ఐదుగురి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మందికి శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 6న పీసీసీ సీనియర్ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ సూచనల మేరకు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
undefined
వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతల్లోనే సమన్వయం లేదు. ఒకరిపై మరొకరు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంలున్నారు. ఎఐసీసీ చీఫ్ గా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవలనే కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
also read:మాది తోటికోడళ్ల పంచాయితీ: రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ కు నష్టం. సీఎం తనయుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా కేంద్రీకరించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమి పాలైంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి తమకే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రజలు కూడా తమకే టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందని విశ్వసిస్తున్నారని బీజేపీ నేతలు