Telangana Budget 2025 కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ పేజీ ఇది. ఇక్కడ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్, కేటాయించిన నిధుల గురించి తెలుసుకోవచ్చు.

12:50 PM (IST) Mar 19
వ్యవసాయ శాఖకు రూ.24,439
పశు సంవర్ధక శాఖకు రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు
విద్యాశాఖకు రూ.23,108 కోట్లు
కార్మిక ఉపాధికల్పనకు రూ.900 కోట్లు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.31,605 కోట్లు
మహిళా శిశు సంక్షేమంకు రూ.2,862 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమంకు రూ.40,234 కోట్లు
షెడ్యూల్ తెగలకు రూ.17,169 కోట్లు
వెనుకబడిన తరగతుల శాఖకు రూ.11,405 కోట్లు
చేనేత రంగానికి రూ.371 కోట్లు
మైనారిటీ సంక్షేమంకు రూ.3,591 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,527 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.12,393 కోట్లు
మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు
హోం శాఖకు రూ.10,188 కోట్లు
దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు
అడవులు పర్యావరణ శాఖకు రూ.1,023 కోట్లు
క్రీడాశాఖకు రూ.465 కోట్లు
పర్యాటకశాఖకు రూ.775 కోట్లు
రోడ్లు భవనాలు శాఖకు రూ.5,907 కోట్లు
12:46 PM (IST) Mar 19
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం రూ.36,504 కోట్లు
12:44 PM (IST) Mar 19
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా గత సంవత్పరం రూ.148 కోట్ల విలువైన మత్తమందుల జప్తు. మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు
హోంశాఖకు ఈ బడ్జెట్ లో రూ.10,188 కోట్ల రూపాయలు కేటాయింపు
12:42 PM (IST) Mar 19
యాదగిరిగుట్ట, అమ్మాపురంలోని కురుమూర్తి దేవాలయం,బాసర సరస్వతి ఆలయం, వేములవాడ ఆలయాల అభివ్రుద్దికి చర్యలు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు రూ.190 కోట్లు కేటాయింపు
12:40 PM (IST) Mar 19
అడవులు మరియు పర్యావరణ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.1,023 కోట్లు కేటాయింపు
12:40 PM (IST) Mar 19
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్, పారా ఒలింపిక్స్ 2024 లో పథకం సాధించిన అథ్లెట్ దీప్తి జివాంజి కి ప్రోత్సాహకంగా ఉద్యోగాలు ఇచ్చాం. క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహణ. క్రీడా శాఖకు ఈ బడ్జెట్ లో రూ.465 కోట్లు కేటాయింపు
12:37 PM (IST) Mar 19
తెలంగాణలో పర్యాటక అభివ్రుద్దికి నూతన టూరిజం పాలసీ
జిఎస్డిపి పర్యాటక రంగం వాటా 10 శాతానికి పెంచడం, 15 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 3 లక్షల ఉద్యోగాల స్రుష్టి. 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం
పర్యాటక శాకకు ఈ బడ్జెట్ లో రూ.775 కోట్లు కేటాయింపు
12:34 PM (IST) Mar 19
రాష్ట్రంలో హైబ్రిడ్ అన్యూటీ మోడల్ ద్వారా రహదారుల అభివ్రుద్దికి నిర్ణయం. ఇందులో 40 శాతం ప్రభుత్వ నిధులు, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడులతో రహదారుల నిర్మాణం. దీనిద్వారా 2028 నాటికి 17 వేల కిలో మీటర్ల గ్రామీణ రహదారులను 28 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం.
రోడ్డు, భవనాల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.5,907 కోట్లు కేటాయింపు
12:31 PM (IST) Mar 19
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటీని పూర్తిచేసే ప్రణాళికలు.. ప్రాధాన్యత క్రమంలో ఏ, బి కేటగిరీలుగా ప్రాజెక్టుల విభజన
నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.23,373 కోట్లు కేటాయింపు
12:29 PM (IST) Mar 19
మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివ్రుద్ది శాఖకు ఈ బడ్జెట్ లో రూ.17,677 కోట్లు కేటాయింపు
12:27 PM (IST) Mar 19
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన పురపాలక సంఘాల, పట్టణాభివ్రుద్ది సంస్థలలో మౌళిక సదుపాయాల కల్పన మరియు అభివ్రుద్దికి రూ.4,500 కోట్లతో ప్రణాళికలు సిద్దం. ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేస్తాం.
హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు రూ.5,942 కోట్ల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్ట్ మంజూరు చేసాం.
ఓఆర్ఆర్ ఫేజ్ 2 కి నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. దీని ద్వారా హెచ్ఎండిఏ పరిధిని విస్తరించి తాగునీరు అందిస్తున్నాం.
12:24 PM (IST) Mar 19
నూతన వైద్య కళాశాలల ద్వారా మరో 400 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 16 నూతన నర్సింగ్ కళాశాలలు, 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2,640 మంది విద్యార్థులకు అదనంగా వైద్య విద్య.
ఉస్మానియా హాస్పిటల్ ను 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో అత్యాధునిక వైద్య సదపాయాలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసాం.
వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెల్ లో రూ.12,393 కోట్లు కేటాయింపు
12:19 PM (IST) Mar 19
రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.11,500 కోట్ల రూపాయల సబ్సిడి విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. అలాగే గ్రుహజ్యోతి పథకం కింద 50 లక్షల కుటుంబాలకు, 30 వేల ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్. ఈ పథకాల కోసం బడ్జెట్ లో రూ.3 వేల కోట్లు కేటాయింపు. మొత్తంగా విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు కేటాయింపు
12:17 PM (IST) Mar 19
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మిస్తాం. ఈ బడ్జెట్ లో ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయింపు
12:15 PM (IST) Mar 19
దావోస్ సదస్సు ద్వారా 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలు లక్షా డెబ్బై ఎనిమిది కోట్ల పెట్టుబడులు,
అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ దేశాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.14,900 కోట్ల ఒప్పందాలు
రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రీప్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు
2050 నాటికి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివ్రుద్ది కోసం మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీ.
పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.3,527 కోట్లు కేటాయింపు
12:10 PM (IST) Mar 19
మైనారిటీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.3,591 కోట్లు కేటాయింపు
12:09 PM (IST) Mar 19
చేనేత రంగానికి ఈ బడ్జెట్ లో రూ.371 కోట్లు కేటాయింపు
12:08 PM (IST) Mar 19
సమగ్ర, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే పేరిట తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టింది, మొత్తం 1.12 కోట్ల కుటుంబ వివరాలు సేకరించాం. 96 శాతం కవరేజ్ తో సామాజిక, ఆర్థిక డేటా సేకరణ. రానున్న పంచాయితీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులను జనాభా ఆధారంగా రిజర్వేషన్లు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు బడ్జెట్ లో రూ.11,405 కోట్లు కేటాయింపు
12:04 PM (IST) Mar 19
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలుచేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అలాగే గిరిజనాభివ్రుద్దికి ప్రభుత్వం ఇందిరా గిరి జలవికాసం ప్రత్యేక పథకం అమలు. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.12,600 కోట్లు కేట్లు ఖర్చు. ఈ బడ్జెట్ ల షెడ్యూల్ కులాల సంక్షేమంకు రూ.40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.17,169 కోట్లు కేటాయింపు
12:00 PM (IST) Mar 19
మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.2,862 కోట్లు కేటాయింపు
11:58 AM (IST) Mar 19
పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ది శాఖకు ఈ బడ్జెట్ లో రూ.31,605 కోట్లు కేటాయింపు
11:57 AM (IST) Mar 19
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులైన మహిళలకు రూ.2 లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం.
11:52 AM (IST) Mar 19
బడ్జెట్ 2025 లో కార్మిక, ఉపాధికల్పన శాఖకు రూ.900 కోట్లు కేటాయింపు
11:51 AM (IST) Mar 19
డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) ట్రైనింగ్ కోర్పులు అందిస్తున్నాం. మినీ డిగ్రీగా ఈ కోర్సును 38 కాలేజీల్లో అందిస్తున్నాం. 10 వేల మందికిపైగా విద్యార్థులకు లబ్ది.
11:48 AM (IST) Mar 19
కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 2023 నాటికి నిరుద్యోగిత రేటు 22 శాతం ఉంటే 2024 నాటికి అది 18 శాతానికి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మరో 30 వేలకు పైగా పోస్టులు మంజూరు చేసాం. మరో 14 వేల అంగన్వాడి పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ.
11:44 AM (IST) Mar 19
తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం. ఇక్కడి వారసత్వ కట్టడాలను సంరక్షిస్తూనే కొత్త భవనాల నిర్మాణానికి రూ.550 కోట్లు కేటాయింపు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం.
11:43 AM (IST) Mar 19
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయలతో అనుమతులు మంజూరు. ఈ స్కూళ్లలో వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా అందిస్తాం. ఐఐటి జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్దం చేస్తా. క్రీడల, కళలు, పోటీలకు ప్రాధాన్యత ఇస్తాం. విద్యాశాఖకి బడ్జెట్ రూ.23,108 కోట్లు కేటాయింపు
11:37 AM (IST) Mar 19
త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ బడ్జెట్ లో పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయింపు
11:35 AM (IST) Mar 19
భూభారతి అనేది భూ యజమానుల హక్కులను కాపాడుతుంది. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ అధునిక సాంకేతికతను ఉపయోగించిన భూభారతి లావాదేవీలను సులభతరం చేసాం. భూపరిపాలనను మరింత బలోపేతం చేయడానికి 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టుల మంజూరు.
11:33 AM (IST) Mar 19
పశు సంవర్ధన శాఖకు ఈ బడ్జెట్ లో రూ.1,674 కోట్లు కేటాయింపు.
11:31 AM (IST) Mar 19
తెలంగాణ బడ్జెట్ 2025 లో వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
11:29 AM (IST) Mar 19
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.ఈ పథకానికి ఆ బడ్జెట్ లో రూ.18000 కోట్లు కేటాయించారు.
11:28 AM (IST) Mar 19
11:26 AM (IST) Mar 19
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మార్చి 2025 నుండి ప్రారంభించాం. ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే అందిస్తాం. 22 వేల కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం నాలుగు లక్షల యాబై వేల ఇళ్లను నిర్మిస్తాం.
11:23 AM (IST) Mar 19
మహాలక్ష్మి, రైతు భరోసా, గ్రుహజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పించన్లు అందిస్తున్నాం. ఇప్పటివరకు 7,227 బస్సుల్లో 149 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేసారు. దీంతో రూ.5005 కోట్లు మహిళలకు ఆదా అయ్యింది.
11:20 AM (IST) Mar 19
తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పన్నులవాటా తగ్గుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 41 శాతం పన్నులు ఇస్తోంది... దీన్ని 50 శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు భట్టి తెలిపారు.
11:17 AM (IST) Mar 19
తెలంగాణలో రూ.3 లక్షలకు పైగా తలసరి ఆదాయం కలిగిఉంది. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం కేవలం రూ.2 లక్షలకు పైగా ఉంది. అంటే రెండింటి మధ్య లక్ష రూపాయల తేడా ఉంది.
11:13 AM (IST) Mar 19
200 బిలియన్ డాలర్లుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది. దీన్ని 1000 ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
11:11 AM (IST) Mar 19
ప్రభుత్వంపై తప్పుడుప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు.
11:10 AM (IST) Mar 19
తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుసగా మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.