మందకొడి పోలింగ్.. టీఆర్ఎస్ కుట్రే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 01, 2020, 07:31 PM IST
మందకొడి పోలింగ్.. టీఆర్ఎస్ కుట్రే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

అధికార పార్టీ భయాందోళనకు గురిచేసినా ఓటర్లు బెదరలేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగిందని బండి ఆరోపించారు

అధికార పార్టీ భయాందోళనకు గురిచేసినా ఓటర్లు బెదరలేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగిందని బండి ఆరోపించారు.

సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెప్పిన తర్వాత టీఆర్ఎస్ కుట్రలు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఎన్నికల కమీషన్ పనిచేసిందని బండి సంజయ్ ఆరోపించారు.

కావాలనే నాలుగు రోజులు సెలవుల్లో ఎన్నికలు పెట్టారని కరీంనగర్ ఎంపీ దుయ్యబట్టారు. కావాలనే ప్రభుత్వ టీచర్లకు డ్యూటీ వెయ్యలేదని బండి సంజయ్ ఆరోపించారు.

ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే పోలింగ్ తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీచర్లపై నమ్మకం లేదని.. అనుభవం లేని వ్యక్తులతో డ్యూటీ చేయించారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రులు బరితెగించి డబ్బులు పంచారని సంజయ్ ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు