ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా ఇవ్వలేదు: అసెంబ్లీలో కేటీఆర్

Siva Kodati |  
Published : Sep 14, 2019, 11:27 AM IST
ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా ఇవ్వలేదు: అసెంబ్లీలో కేటీఆర్

సారాంశం

ఐటీఐఆర్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని... దీని కోసం విపక్షాలను కలుపుకొంటూ పోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదని కేటీఆర్ వాపోయారు. ఐటీఐఆర్‌కు కేంద్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం సభలో మూసీ నదిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మురుగునీటి శుద్ధీకరణఖు 21 ప్లాంట్లు పనిచేస్తున్నాయని.. 2021 నాటికి వీటిని రెట్టింపు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో 54 శాతం డ్రైనేజీ మూసీలో కలుస్తోందన్నారు. మరోవైపు ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ విశేష ప్రగతి సాధించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

ఐటీఐఆర్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని... దీని కోసం విపక్షాలను కలుపుకొంటూ పోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదని కేటీఆర్ వాపోయారు.

ఐటీఐఆర్‌కు కేంద్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. దీనిని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకుపోవాల్సిన అసరముందని.. ఆ దిశగా చర్యలు చేపట్టబోతున్నామని కేటీఆర్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu