నేడు న్యూఢీల్లీకి కిషన్ రెడ్డి: బీజేపీ సెకండ్ లిస్ట్‌పై కసరత్తు

By narsimha lode  |  First Published Oct 25, 2023, 10:57 AM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢీల్లీకి వెళ్లనున్నారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చర్చించనున్నారు. మరో వైపు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలపై పార్టీ అగ్రనేతలతో  కిషన్ రెడ్డి  చర్చించే అవకాశం ఉంది. 



హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  బీజేపీ ఫోకస్ పెట్టింది.రెండో జాబితాపై కసరత్తును కమలదళం ప్రారంభించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.  రెండో జాబితాలో పొందుపర్చాల్సిన అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేయనున్నారు. మరో వైపు బీజేపీ అగ్రనేతలతో కూడ  కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.

ఈ నెల  22న బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 52 మందికి తొలి జాబితాలో  చోటు దక్కింది.  మిగిలిన అభ్యర్థులకు రెండో జాబితాలో చోటు కల్పించనున్నారు. ఈ ఎన్నికల్లో  తమకు మద్దతివ్వాలని  బీజేపీ నేతలు  జనసేనను కోరింది. కనీసం తమకు  20 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని  జనసేన బీజేపీని కోరుతుంది.  అయితే ఆరు నుండి  10 అసెంబ్లీ స్థానాలను  జనసేనకు కేటాయించాలని  బీజేపీ భావిస్తుంది.

Latest Videos

undefined

 జనసేనకు కేటాయించాల్సిన స్థానాలు మినహాయించి  ఇతర స్థానాల్లో  అభ్యర్థుల జాబితాపై  బీజేపీ  నాయకత్వం ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా  32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అయితే  ఈ నెల  18న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు.  అయితే తమకు 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీని కోరినట్టుగా  సమాచారం. అయితే 10 అసెంబ్లీ స్థానాలను  జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉంది. 

also read:కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై దర్యాప్తు జరిపించాలి: రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కిషన్ రెడ్డి

మరో వైపు  బీజేపీలో కీలకంగా  ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే  ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయాలపై  కూడ  కిషన్ రెడ్డి  బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు.నవంబర్ తొలి వారంలో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అగ్రనేతలు  విస్తృతంగా  ప్రచారం చేయనున్నారు.
 

click me!