Telangana Assembly Elections: గురువారం తెలంగాణలో పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అయితే, e-EPIC, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించబడతాయి. వాటిక అదనంగా పోలింగ్ స్టేషన్‌లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.
Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) సూచించింది. తొలిసారి ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు పలు విషయాలు తెలుసుకోవాలని పేర్కొంది.
మీరు మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..
undefined
ఓటు వేయడానికి తప్పనిసరిగా ఓటరు స్లిప్ అవసరం అవుతుంది. దీనితో పాటు ఏదైన ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్డును పోలింగ్ బూత్ లోని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సూచించిన సమయం వరకు మాత్రమే ఓటు వేయడానికి ఉంటుంది, కాబట్టి దాని ప్రకారం ప్రణాళికలు చేసుకోవాలి. ఇలాంటి వివరాలు గమనిస్తే..
1. ఓటు వేయడానికి మీకు ఓటర్ ఐడీ కార్డు ఉండాలి లేదా ఓటరు స్లిప్ ఉండాలి.
2. మీ ఓటు ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకుని పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్ తో పాటు ఓటర్ ఐడీ, ఏదైన ప్రభుత్వం గుర్తింపు ఉన్న కార్డును తీసుకెళ్లాలి.
3. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే మొదటి అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో మీ పేరు, సంబంధిత వివరాలు పరిశీలిస్తారు. ఇక్కడ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే తర్వాత రెండో అధికారి వరకు పంపిస్తారు.
4. రెండో అధికారి తన వద్ద ఉన్న సిరాను మీ చూపుడు వేలికి అంటిస్తారు. దీనితో పాటు లిస్టులో ఉన్న మీపేరుకు సంబంధించిన ఒక స్లిప్ ను మీకు అందిస్తారు.
5. అక్కడి నుంచి రెండో అధికారి మిమ్మల్ని మూడో అధికారి దగ్గరకు వెళ్లమని చెబుతారు. మూడో అధికారి మీ వద్ద ఉన్న స్లిప్ ను పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఓటు వేసే ప్రాంతమైన ఈవీఎం దగ్గరకు పంపుతారు.
6. ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు, ఫొటో, వారికి సంబంధించి గుర్తులు ఉంటాయి. వాటికి ఎదురుగా బటన్స్ ఉంటాయి. మీరు ఓటు వేయాలనుకున్న వ్యక్తి లేదా పార్టీ, గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కి మీ ఓటును వేయాలి.
7. ఈవీఎం బటన్ నొక్కగానే ఆ బటన్ లోని లైట్ వెలుగుతుంది. అలాగే, బీప్ అని ఒక శబ్ధం వస్తుంది. దీంతో పక్కనే ఉన్న వీవీప్యాట్ లో మీరు ఓటువేసిన గుర్తుకు సంబంధించి వివరాలతో ఒక స్లిప్ కొన్ని సెకండ్ల పాటు కనిపించి కిందపడి పోతుంది.
8. మీరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈవీఎం బటన్ నొక్కగానే బీప్ అని సౌండ్ రాకపోయినా, బటన్ లైట్ వెలుగకపోయినా, వీవీప్యాట్ లో మీ ఓటుకు సంబంధించిన స్లిప్ రాకపోయిన అక్కడే ఉన్న అధికారికి వెంటనే సమాచారం అందించాలి.