కేటీఆర్‌తో పద్మారావు గౌడ్ భేటీ.... పార్టీ మార్పు ప్రచారంపై వివరణ

By Siva KodatiFirst Published Oct 18, 2022, 9:06 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. 

పార్టీ మారతారంటూ జరుగుతోన్న ప్రచారంపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసున్న ఫోటో బయటకు రావడంతో పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో పద్మారావు భేటీ అయ్యారు. పార్టీ మారేదేమి లేదని కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు పద్మారావు. అటు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. పద్మారావు కొడుకు పెళ్లికి వెళ్లి ఆశీర్వదించానని.. పెళ్లికి వెళ్తే టచ్‌లో వున్నట్టా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

కాగా.. తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోని కీలక నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే అధికార పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలపైనా ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్ రెడ్డితో పద్మారావు గౌడ్ వున్న ఫోటోలు బయటకు రావడంతో టీఆర్ఎస్ ఉలిక్కిపడింది. అటు పద్మారావు గౌడ్ కూడా స్పందించారు. తాను పార్టీ వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తోన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పద్మారావు గౌడ్ హెచ్చరించారు. 

ALso REad:నేను వ్యక్తిగతంగా అవమానపడ్డాను.. టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. కేసీఆర్‌‌కు లేఖ..

ఇకపోతే.. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షునికి బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. ఈ లేఖలో బూర నర్సయ్య గౌడ్ పలు అంశాలను ప్రస్తావించాడు. తాను పార్టీలో వ్యక్తిగతంగా అవమానపడ్డానని చెప్పారు. తనకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని.. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు వివక్షతకు గురవుతున్నారని ఆరోపించారు.  

కేసీఆర్‌ అంటే అభిమానం అని.. తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతో ఇప్పటివరకు టీఆర్ఎస్ ఉన్నానని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు. అవకాశాలు రాకున్నా పర్వాలేదని.. కానీ అఅట్టడు వర్గాల సమస్యలను కనీసం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశమే లేనప్పుడు.. తాను టీఆర్ఎస్‌లో కొనసాడం అర్ధరహితం అని పేర్కొన్నారు. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని చెప్పారు. ఇక, బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీ చేరే అవకాశం ఉంది. 
 

click me!