
నిజామాబాద్ (nizamabad district) జిల్లాలో దారుణం జరిగింది. భీంగల్ మండలం బాబాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి (suicide) పాల్పడ్డారు. ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా ఆమెను కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు ఉపాధ్యాయురాలి ఆత్మహత్యపై పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా రహత్‌నగర్‌లో సరస్వతి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె మరణంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.