క్షయ వ్యాధి పై టీబీ అలర్ట్ ఇండియా ఎన్జీఓ అవగాహనా సదస్సును హైదరాబాద్ లో నిర్వహించింది.
దేశంలో క్షయ వ్యాధి నిర్మూలన కోసం కృషి చేస్తున్న టీబీ అలర్ట్ ఇండియా ఈరోజు హైదరాబాద్ కిషన్ నగర్ లో ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక కార్పొరేటర్ ఎండి. మూస, టీబీ అలర్ట్ ఇండియా కోఆర్డినేటర్ వీరమల్లు, వైద్య సిబ్బంది నీలిమ, శోభారాణి, కవిత, మనోరమ, స్థానిక ప్రతినిధులు మహ్మద్, జాంషద్ ఖాన్, మహ్మద్ అతీక్, సయ్యద్ ఇమ్రాన్, నయీమ్ బాబా, సయ్యద్ యాసీన్, స్థానిక ప్రజలు పాల్గొని దీనిని విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమంలో టీబీ అలర్ట్ కోఆర్డినేటర్ వీరమల్లు మాట్లాడుతూ టీబీ నిశ్శబ్దంగా మనుషుల ప్రాణాలను హరించి వేస్తుందని, దీనిని ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే త్వరితగతిన దీని నుండి బయటపడొచ్చని తెలిపారు. క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, దాని చెందవలిసిన అవసరం లేదని, పూర్తి స్థాయి కోర్స్ వాడి, మంచి పౌష్టికాహారం తీసుకుంటే త్వరగా మనుషులు కోలుకుంటారని తెలిపారు వీరమల్లు.