తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్: సంస్కృతిపై మక్కువ

Published : Aug 07, 2019, 12:20 AM IST
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్: సంస్కృతిపై మక్కువ

సారాంశం

హైదరాబాదులో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నారు. సంప్రదాయ ఆధునీకరణల పరిపూర్ణ మేళవింపుగా ఆమె తెలంగాణను అభివర్ణిస్తూ తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని చెబుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎన్నటికీ మరిచిపోలేరు. తెలంగాణ చిన్నమ్మగా ఆమె వారికి గుర్తుండిపోతారు. తెలంగాణతో ఆమె మరుపురాని అనుబంధాన్ని పెంచుకున్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో బలమైన వాణిని వినిపించారు. 

ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో సుష్మ స్వరాజ్ అనేక మార్లు తెలంగాణ వాణిని వినిపించారు. తెలంగాణ ప్రజల గొంతును వినాలని ఆమె పార్లమెంటులో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు పార్లమెంటులో వివరించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో తన కృషిని గుర్తించి తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. దాంతో ఆమె తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోతారు. 

2017 నవంబర్ లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నారు. సంప్రదాయ ఆధునీకరణల పరిపూర్ణ మేళవింపుగా ఆమె తెలంగాణను అభివర్ణిస్తూ తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని చెబుకున్నారు. తనకు తెలంగాణ సంస్కృతి సుపరిచితమని కూడా చెబుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu