కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట డీఎంహెచ్ఓ నిరంజన్ పై వేటు పడింది, ఆయనను బదిలీ స్థానంలో ఆ స్థానంలో డాక్టర్ సాంబశివ రావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి (డీఎంహెచ్ఓ)పై వేటు పడింది. సూర్యాపేట వైద్య, ఆరోగ్యాధికారిగా నిరంజన్ ను ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో డాక్టర్ సాంబశివరావును డీఎంహెచ్ఓగా నియమించింది. డాక్టర్ సాంబశివరావు గతంలో యాదాద్రి జిల్లాలో పనిచేశారు.
ఇదిలావుంటే, కరోనా వైరస్ విజృంభణ ఇద్దరు డిఎస్పీలకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. తెలంగాణలోని గద్వాల, సూర్యాపేట డీఎస్పీలపై డీజీపీ మహేందర్ రెడ్డి బదిలీ చేశారు. పోలీసు కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.
undefined
తెలంగాణలోని సూర్యాపేట, గద్వాలల్లో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. తీవ్రమైన ఆందోళనకు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల డిఎస్పీలు బదిలీ అయ్యారు.
సూర్యాపేట డీఎస్పీ ఎం నాగేశ్వర రావును, గద్వాల డిఎస్పీ పి. శ్రీనివాస రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.
హైదరాబాదులోని స్పెషల్ బ్రాంచ్ ఎసీపీ ఎస్ మోహన్ కుమార్ ను సూర్యాపేట డీఎస్పీగా, టీఎస్ పీఎ డీఎస్పీ ఎ. యాదగిరిని గద్వాల డీఎస్పీగా బదిలీ చేశారు.