సుప్రీంకోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌కు చుక్కెదురు...

By Arun Kumar PFirst Published Jan 28, 2019, 2:50 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు మండలాల ఓటర్లను ఏపిలో కలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టివైస్తూ తీర్పు వెలువరించింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై  పోలవరం పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపుకు గురయ్యే ప్రమాదం వుంది. దీంతో పునరావాసం, పరిహారం తదితర విషయాల్లో సమస్యలు తలెత్తకుండా వుండేందుకు ఈ ముంపు మండలాలను ఏపిలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై గత నాలుగేళ్ళుగా వివాదం చెలరేగుతోంది. 

అయితే కేంద్రం నిర్ణయంతో ఎన్నికల సంఘం కూడా ఈ ఏడు మండలాల ఓటర్లను ఏపిలో కలిపింది.  తెలంగాణలోని ప్రాంతాలను ఏపిలో కలప సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మొదట రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. 

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా...కేవలం ఆర్డినెన్స్ ద్వారా ముంపు మండలాలను ఏపిలో కలపడం కుదరదని కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదించారు.  అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని...కేంద్ర ఆర్డినెన్స్ ఆర్టికల్ 170కి విరుద్దమని న్యాయమూర్తికి తెలిపారు. 

అయితే కాంగ్రెస్ వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వ్యతిరేకించారు. ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

click me!