హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన.. పలువురికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 5:44 PM IST
Highlights

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన చేపట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన చేపట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలు.. కామన్ ఎంట్రన్స్ టేస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. క్యాంపస్‌లోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం వెలుపల విద్యార్థులు నినాదాలు చేశారు. ఫీజుల పెంపుతో విద్యార్థులపై భారం పడుతుందని విద్యార్థులు చెప్పారు. 

ఫీజుల పెంపుదల విషయాన్ని యాజమాన్యం దృ‌ష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఉన్నారని.. ఫీజుల పెంపుతో వారిపై తీవ్ర భారం పడుతుందన్నారు. 

ఇక, ఆందోళనకు దిగిన విద్యార్థులను యూనివర్సిటీ సేక్యురిటీ సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్యలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఫీజులు తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. 
 

click me!