సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..

Published : Sep 28, 2023, 12:07 PM IST
 సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..

సారాంశం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఓ బీసీ గురుకులంలో విద్యార్థి అనుమానస్పద స్థితిలో మరణించాడు. హాస్టల్ ఆవరణలో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఓ బీసీ గురుకులంలో విద్యార్థి అనుమానస్పద స్థితిలో మరణించాడు. హాస్టల్ ఆవరణలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వివరాలు.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న-జయలక్ష్మిల కుమారుడు రాకేష్ మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే రాకేష్.. బుధవారం రాత్రి హాస్టల్‌లోని మరుగుదొడ్ల సమీపంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ వాసులు గురువారం ఉదయం హాస్టల్ ఆవరణలో షెడ్డులో వేలాడుతున్న రాకేష్‌ను గుర్తించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రాకేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?