కేసీఆర్ కేటీఆర్ లను బంగాళాఖాతంలో పడేయ్యాలి: విజయశాంతి

Published : Oct 12, 2018, 09:18 PM IST
కేసీఆర్ కేటీఆర్ లను బంగాళాఖాతంలో పడేయ్యాలి: విజయశాంతి

సారాంశం

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం సభ్యత, సంస్కారం లేని ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్  జిల్లాలో పర్యటించిన ఆమె రైతు బంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.   

నాగర్‌కర్నూలు: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం సభ్యత, సంస్కారం లేని ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్  జిల్లాలో పర్యటించిన ఆమె రైతు బంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ వ్యాప్తంగా 4వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు చెక్కులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెుదటి సంవత్సరం రైతు బంధు పథకాన్నిఎందుకు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు. 

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని రాములమ్మ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు బంగాళాఖాతంలో పడేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజయశాంతి పిలుపునిచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech