Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునే వారి కోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపింది.
Special Trains: తెలుగువారి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒక్కటి.. ఈ పండుగకు సొంత వూరిలో ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి గమ్యానికి చేరుకుంటారు . బస్సులు, రైళ్లలో బుకింగ్ ఓపెన్ చేసిన నిముషాల్లోనే టికెట్లు నిండుకుంటాయి. పెద్ద పండగకి ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయాణీకులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేక రైళ్లు ఇవే !
సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ , బ్రహ్మపూర్ - వికారాబాద్, విశాఖపట్నం - కర్నూలు సిటీ, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ టౌన్, సికింద్రాబాద్ - నర్సాపూర్ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఏ రోజు ఏ రూట్లలో..
జనవరి 7, 14 తేదీల్లో.. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089)
జనవరి 8, 15 తేదీల్లో- బ్రహ్మాపూర్ – వికారాబాద్ (07090)
జనవరి 9, 16 తేదీల్లో- వికారాబాద్ – బ్రహ్మపూర్ (07091)
జనవరి 10, 17 తేదీల్లో- బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092)
జనవరి 10, 17, 24 తేదీల్లో- విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541)
జనవరి 11, 18, 25 తేదీల్లో- కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542)
జనవరి 12, 19, 26 తేదీల్లో- శ్రీకాకుళం – వికారాబాద్ (08547)
జనవరి 13, 20, 27 తేదీల్లో- వికారాబాద్ – శ్రీకాకుళం (08548)
జనవరి 10, 17 తేదీల్లో- సికింద్రాబాద్ – తిరుపతి (02764)
జనవరి 10 తేదీన నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251)
జనవరి 11 తేదీన సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252)
జనవరి 11, 18 తేదీల్లో- తిరుపతి – సికింద్రాబాద్ (02763)
జనవరి 12 తేదీన.. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271)
జనవరి 13 తేదీన.. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272)
జనవరి 8, 15 తేదీల్లో.. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093)
జనవరి 9, 16 తేదీల్లో.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094)