టీంమెంబర్‌తో సాఫ్ట్‌వేర్ రాసలీలలు...రెడ్‌‌హ్యాండెడ్‌గా భార్యకు చిక్కి

Published : Dec 26, 2018, 07:23 PM ISTUpdated : Dec 26, 2018, 07:29 PM IST
టీంమెంబర్‌తో సాఫ్ట్‌వేర్ రాసలీలలు...రెడ్‌‌హ్యాండెడ్‌గా భార్యకు చిక్కి

సారాంశం

అతడికి ఓ మల్టీనేషనల్ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి జీతం...అంతకంటే మంచి జీవితం. ఆఫీసులో టీంలీడర్ గా మంచి స్థానం. ఇలా కీలకమైన స్థానంలో వుండి హుందాగా వ్యవహారించాల్సింది పోయి నీచమైన పనికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్ హ్యండెడ్ గా పట్టుబడి పరువు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

 నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన నాగరాజు టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) కంపనీలో సాఫ్ట్‌వేర్  ఇంజనీర్ (టీంలీడర్) గా పనిచేస్తున్నాడు. ఇతడికి అమూల్యతో 11ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. 

అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో అక్రమ సంబంధం చిచ్చురేగింది. నాగరాజు తన టీంలో పనిచేసే ఓ మహిళ లోబర్చుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిత్యం ఆమెతోనే ఉంటూ భార్యా బిడ్డను కూడా మరిచాడు. ప్రియురాలి మోజులో భార్యా, బిడ్డలను కూడా ఇంట్లోంచి గెంటేయడమే కాదు...చెప్పాపెట్టకుండా ప్రియురాలితో కలిసి నివాసాన్ని మార్చాడు. 

ఆరు నెలలుగా భార్యకు చిక్కకుండా రహస్యంగా ప్రియురాలితోనే సహజీవనం చేస్తున్నాడు. అయితే చివరకు ఎలాగోలా భర్త నివాసాన్ని కనిపెట్టిన అలేఖ్య రెడ్ హ్యండెడ్ గా వారి గుట్టు బయటపెట్టింది. హస్తినపురంలోని ద్వారాకానగర్ లో భర్త, ప్రియురాలు కలిసుండగా పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లి ఇద్దరిని వారికి అప్పగించింది.   
 
PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో మ‌రో కొత్త షాపింగ్ మాల్‌.. న‌గ‌రం న‌డిబొడ్డున దేశంలోనే తొలి ఏఐ మాల్‌, ఎక్క‌డో తెలుసా.?
Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి