వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

Published : Dec 26, 2020, 08:42 AM IST
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

సారాంశం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఏపీలో చిత్తూరు జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, లారీ, ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో విషాదకరమైన వాతావరణం నెలకొంది. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 

లారీ, ఒమ్మి వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మరణించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

మృతులను రాజమ్మ (80), అన్నపూర్ణ (60), జ్యోతి (14)లుగా గుర్తించారు. మృతులు కర్ణాటకలోని నంగరి మండలం తొండపల్లి గ్రామానికి చెందినవారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు
IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే