ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ యాక్టివిటీ.. దండకారణ్యంలో చేతిపంపుల కోసం రూ. 38.20 లక్షల చెక్కు

By Mahesh KFirst Published Dec 15, 2022, 9:13 PM IST
Highlights

హైదరాబాద్ అమరావతి సర్కిల్ ఎస్‌బీఐ సీఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా దండకారణ్యంలో 20 గిరిజన గ్రామాల్లో చేతిపంపులను ఏర్పాటు చేయడానికి రూ. 38.20 లక్షల చెక్కును అవేర్ అనే ఎన్జీవోకు అందించింది. మేనేజింగ్ డైరెక్టర్ (ఐబీ, జీఎం, టీ) చల్లా శ్రీనివాసులు శెట్టి రూ. 38.20 లక్షల చెక్కును ఎన్జీవో అవేర్ చైర్మన్ పీకేఎస్ మాధవన్‌కు అందించారు.
 

హైదరాబాద్: స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీఎస్‌ఆర్ యాక్టివిటీలో భాగంగా దండకారణ్య గిరిజనులకు మంచి నీటిని అందించాలని నిర్ణయం తీసుకుంది. సురక్షిత నీరు అందుబాటులో లేని, తాగడానికి వాగులు, వంకలు, కొలనుల్లోని అపరిశుద్ధమైన నీటినే తాగుతున్న ట్రైబల్స్‌ కోసం చేతి పంపులను ఏర్పాటు చేయడానికి రూ. 38.20 లక్షల చెక్కును అవేర్ ఎన్జీవోకు అందించింది. మారేడిమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతం సమీపంలోని దండకారణ్యంలో 20 గిరిజనుల గ్రామాల్లో చేతి పంపుల కోసం డీప్ బోర్ వెల్స్ ఏర్పాటు చేసే ‘ఆదివాసీ జీవన్ గంగ’కు సంబంధించిన ప్రాజెక్టుకు ఈ డబ్బులు చేరనున్నాయి. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీ, అమరావతి సర్కిల్ ఎస్‌బీఐ ఈ రోజు (14.12.2022) హైదరాబాద్‌లో ఈ సీఎస్‌ఆర్ యాక్టివిటీని చేపట్టింది.

మేనేజింగ్ డైరెక్టర్ (ఐబీ, జీఎం, టీ) చల్లా శ్రీనివాసులు శెట్టి రూ. 38.20 లక్షల చెక్కును ఎన్జీవో అవేర్ చైర్మన్ పీకేఎస్ మాధవన్‌కు అందించారు. అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా, ఇతర జనరల్ మేనేజర్ల సమక్షంలో ఈ చెక్కును అందజేశారు.

Also Read: సామాన్యుల అవసరాలను ఈ ఫౌండేషన్ నా కళ్ళు తెరిపించాయి: సుధా మూర్తి

పర్యావరణ హిత, వైవిధ్యమైన కార్యకలాపాలపై బ్యాంకు దృష్టి సారించి ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఎస్‌బీఐ సీఎస్ఆర్ యాక్టివిటీస్, ఇతర బ్యాంకు స్కీముల ద్వారా లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. 20 ఆదివాసీ గ్రామాల్లో ఎస్‌బీఐ, అవేర్ రెండూ కలిసి పని చేసి సురక్షిత నీటిని అందించే ప్రాజెక్టు పూర్తి చేస్తాయి. 

ఈ కార్యక్రమంలో కే గుండు రావు జీఎం (ఎన్‌డబ్ల్యూ 3), క్రిషన్ శర్మ జీఎం (ఎన్‌డబ్ల్యూ 1), ఓం నారాయణ్ శర్మ జీఎం (ఎన్‌డబ్ల్యూ 2), ఇతర ఎస్‌బీఐ అధికారులు క్రియాశీలంగా పాల్గొన్నారు.

click me!