హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వస్తే... కాంగ్రెస్ పోటీ చేస్తుంది, నో డౌట్: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 14, 2021, 02:43 PM IST
హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వస్తే... కాంగ్రెస్ పోటీ చేస్తుంది, నో డౌట్: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదాలు గుర్తించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. 

రాజకీయ విమర్శలు కాకుండా.. ప్రజలు ఎంత ఇబ్బందిపడుతున్నారో చూడాలని జగ్గారెడ్డి హితవు పలికారు. రెమిడిసివర్ ఇంజెక్షన్‌ను అందించడంలో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు. రెమ్‌డిసివర్ లేక, ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఉత్తమ్ డిమాండ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా కేటీఆర్ చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్, బెడ్ల సంఖ్య‌ను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఆపవద్దని.... కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పైనా జగ్గారెడ్డి స్పందించారు. ఈటల, టీఆర్ఎస్‌లది ఇంటి పంచాయితీ అని.. దాంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.

తమకు హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి ఉన్నారని... కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్నారని ప్రశంసించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడుతుందని... అందులో ఎలాంటి సందేహమూ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?