చారాణ కోడికి బారాణ మసాలా..!: రుణమాఫీపై కేటీఆర్ 

By Arun Kumar PFirst Published Jul 19, 2024, 2:35 PM IST
Highlights

రైతు రుణాల మాపీ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేసారు. ఈ రుణమాఫీతో సంతోషించే రైతుల కంటే బాధపడేవారే ఎక్కువ ఉన్నారన్నారన్నారు. ఈ సందర్భంగా చారాణ కోడి...బారాన మసాాలా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల లోక్ సభ ఎన్నికల సమయంలో రుణమాఫీ ఆగస్ట్ 15 లోపు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలను నెరవేరుస్తూ మూడు విడతల్లో రైతు రుణాల మాఫీకి సిద్దమయ్యింది రేవంత్ సర్కార్... ఇప్పటికే మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసారు. ఇలా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6 వేల కోట్లకుపైగా నిధులు జమచేసారు. 

అయితే ఈ రుణమాఫీ ప్రక్రియపై ప్రతిపక్ష బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అర్హులైన రైతులు 40 లక్షలకు పైగా వుంటే కేవలం పదకొండు లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటి? “చారాణ కోడికి..! బారాణ మసాలా...!!” అన్నట్లుంది పరిస్థితి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసారు. రైతు రుణమాఫీపై ఆయన ఎక్స్ వేదికన స్పందించారు. 

Latest Videos

''సీఎం రేవంత్ రెడ్డి గారు...ఊరించి ఊరించి చివరకు ఏడునెలలు ఏమార్చి చేసిన మీ రుణమాఫీ తీరు చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన  సామెత ఒక్కటే...“చారాణ కోడికి..! బారాణ మసాలా...!! రుణమాఫీ అయిన రైతులకన్నా...కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ.ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..! రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. 

''అన్నివిధాలా అర్హత ఉన్నా...ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు... రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు... అర్హులైన లబ్దిదారులు  రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ? నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?'' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేసారు. 

''ఇప్పటికే రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే.జూన్ లో వేయాల్సిన రైతుభరోసా... జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!! కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!! రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!! మభ్యపెట్టే మీ పాలన గురించి 
ఒక్క మాటలో చెప్పాలంటే... ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..! ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!'' అంటూ రైతు రుణమాఫీపై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. 

 

click me!