ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు: నేడు జేఎసీ కీలక భేటీ

By narsimha lodeFirst Published Oct 7, 2019, 12:06 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు  భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు భేటీ కానున్నారు. 

హైదరాబాద్: ఆర్టీసీ జేఎసీ  నేతలు సోమవారం నాడు సమావేశం కానున్నారు.భవిష్యత్తు కార్యాచరణను  ప్రకటించనున్నారు.  జేఎసీ నేతలు  ఏ రకమైన కార్యాచరణను ప్రకటిస్తారో అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సోమవారం నాడు ఉదయం పూట  ఆర్టీసీ జేఎసీ నేతలు గన్‌పార్క్ వద్ద  ఆర్టీసీ కార్మికులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఎసీ నేతలను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆర్టీసీ జేఎసీ నేతలు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశంకానున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై జేఎసీ చర్చించనుంది. సమ్మెలో  ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ తరుణంలో సమ్మెను ఉధృతం చేయాలని జేఎసీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు జేఎసీ అత్యసవర  సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో జేఎసీ నేతలు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.  ఆర్టీసీలో కొత్తవారిని ఉద్యోగాల్లో నియమించుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. 
 

click me!