మా సమ్మె న్యాయబద్దమే: కేసీఆర్ కు ఆశ్వథామ రెడ్డి రిప్లై

By narsimha lodeFirst Published Oct 7, 2019, 3:17 PM IST
Highlights

ఆర్టీసీ జేఎసీ తమ కార్యాచరణను ఎల్లుండి ప్రకటించనుంది. సమ్మె విషయమై జేఎసీ నేతలు న్యాయ సలహా తీసుకొన్నారు. 


హైదరాబాద్: సమ్మె న్యాయబద్దమైందనేనని న్యాయ నిపుణులు చెప్పారని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి చెప్పారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని  ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు ఈయూ కార్యాలయంలో  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై న్యాయ సలహా తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమ్మె న్యాయబద్దమైందేనని తమకు న్యాయ నిపుణులు చెప్పారన్నారు. సమ్మె న్యాయబద్దమైందేనని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటనలకు భయపడే సమస్యే లేదన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదన్నారు. ఉద్యమాలతోనే కేసీఆర్ సీఎం అయ్యారని ఆశ్వథామరెడ్డి గుర్తు చేశారు. సీఎం అయ్యాక  ఉద్యమాలను అణచివేసేందుకు కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఆశ్వథామరెడ్డి ప్రకటించారు.ఇతర రాష్ట్రాల ఆర్టీసీతో పోల్చవద్దని ఆయన సూచించారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ఆర్టీసతో పోల్చాలని  ఆశ్వథామరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

ఏపీ సీఎం జగన్  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం తర్వాత  తెలంగాణ రాష్ట్రంలో కూడ ఆర్టీసీని విలీనం  చేయాలని  కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లుండి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆశ్వథామరెడ్డి ప్రకటించారు.

click me!